BHNG: రాజపేట మండలం కేంద్రంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా మారింది. ముఖ్యంగా రోడ్డుమార్గంలో గుంపులుగా తిరుగుతూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రాత్రివేళ ఆరుపుల కారణంగా నిద్రకు దూరమవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మార్గం గుండా ఒంటరిగా వెళ్లాలంటే భయపడాల్సి వస్తుందన్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
తెలంగాణ
నగరంలో వీధి కుక్కల బెడద


