హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రయాణికుడి ముక్కు కొరికిన ఎలుక

ఉనా హిమాచల్‌-ఇందౌర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ కోచ్‌లో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. ఆగ్రా డివిజన్‌లో ప్రయాణిస్తుండగా ఓ ఎలుక అతడి ముక్కును కొరికింది. ఈ నెల 22న జరిగిన ఈ ఘటనపై బాధితుడు ఎక్స్‌ వేదికగా ఫిర్యాదు చేయడంతో బయటకొచ్చింది. స్పందించిన రైల్వే అధికారులు బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించి, రైలులో ఎలుకల నివారణ చర్యలు చేపట్టామని తెలిపారు.