హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విశేష అలంకరణలో వనదుర్గాభవాని

MDK: శ్రీ ఏడుపాయల ఆలయంలో మంగళవారం వనదుర్గాభవాని అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు. ఉదయం నుంచే అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు నేత్రపర్వంగా నిర్వహించారు. మంగళవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు మంజీరా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి, దర్శనాలు చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు.