హైదరాబాద్: 28°C
వార్తలు

'బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేది TDP మాత్రమే'

AP: తనను తాను రక్షించుకోవడానికి YCP అధినేత జగన్ ఎంతకైనా తెగిస్తారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అవినీతి వ్యవహారాల్లో బీసీ నాయకులను జగన్ కేసుల్లో ఇరికిస్తారని అన్నారు. బలహీన వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా సాధికారత సాధించాలని జగన్ కోరుకోరని అన్నారు. బలహీన వర్గాలకు అండగా నిలిచేది, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చేది TDP మాత్రమే అని యనమల వ్యాఖ్యానించారు.