హైదరాబాద్: 28°C
వార్తలు

కొనసాగుతున్న బీజేపీ నిరాహార దీక్ష

TG: బీజేపీ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతుంది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 48 గంటల నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రామచందర్‌రావు దీక్షను విరమించనున్నారు.