హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓయూలో PhD కేటగిరీ-II నోటిఫికేషన్

HYD: ఉస్మానియా యూనివర్సిటీ PhD ఎంట్రన్స్ టెస్ట్-2026 కేటగిరీ-IIకి ఆగస్టు 26 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 648 ఖాళీలు ఉండగా, సైన్స్‌లో అత్యధికంగా 337, ఇంజినీరింగ్‌లో 119 సీట్లు ఉన్నాయి. ఫైన్ లేకుండా సెప్టెంబర్ 25 వరకు, రూ.2,000 ఫైన్‌తో అక్టోబర్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్షలు అక్టోబర్ రెండో వారంలో జరగనున్నాయి.