TG: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 18,000, ఔట్ ఫ్లో 20,015 క్యూసెక్కులు నమోదవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 318.32 మీటర్లు ఉంది. 2 యూనిట్లలో 78 మోగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. అలాగే, కుడి, ఎడమ కాల్వల ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ జలాశయాలకు వరద నీరు విడుదల చేస్తున్నట్లు డ్యామ్ అధికారులు తెలిపారు.
వార్తలు
జూరాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం


