MNCL: రాముని చెరువు కట్టపై కోతుల బెడద పెరగడంతో వాకర్స్ భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కోతులు దాడి చేసి పలువురిని గాయపరిచిన నేపథ్యంలో అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కోతుల నియంత్రణకు నిధులు కేటాయించినందున చర్యలు వేగవంతం చేయాలని వాకర్స్ విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకముందే కోతుల బెడదను నివారించాలని గజెల్లి వెంకటయ్య కోరారు.
తెలంగాణ
కోతుల బెడదతో వాకర్స్ బెంబేలు


