హైదరాబాద్: 28°C
వార్తలు

గోధుమల ఎగుమతిపై నిషేధం తొలగింపు

కేంద్ర ప్రభుత్వం గోధుమల ఎగుమతిపై నాలుగేళ్లుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. దేశంలో బఫర్ స్టాక్స్ ఎక్కువగా మిగిలిపోవడం, దేశీయంగా ధరలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాన్ తొలగింపు ఆటా, మైదా సహా అన్ని రకాల ఉత్పత్తులకు వర్తిస్తుంది. 2022లో ఫుడ్ సెక్యూరిటీ, ధరలు కంట్రోల్ చేసేందుకు ఎగుమతులను బ్యాన్ చేయగా ఈ ఏడాది ఆరంభంలో ఏటా 5M టన్నుల ఎగుమతికి అనుమతిచ్చింది.