NRML: దేవాపూర్‌లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో బొలెరోలో తరలిస్తున్న 56 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని చెన్నూరుకు తరలిస్తున్నట్లు నిందితులు సతీష్, ఉపేందర్ తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై గంగారాం తెలిపారు.
తెలంగాణ
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత


