హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వివాహితపై వేధింపులు: వీఆర్‌ఏపై కేసు నమోదు

సత్యసాయి: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్న వీఆర్‌ఏపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెనుకొండ మండలం మునిమడుగు గ్రామానికి చెందిన వీఆర్‌ఏ రాము తమను వేధిస్తున్నట్లు ఒక వివాహిత ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కియా స్టేషన్ ఏఎస్సై హరినాథ్ కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.