హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బురద రోడ్డుపై గ్రామస్థులు వరి నాట్లు వేసి నిరసన

BHPL: గోరి కొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో రహదారి దుస్థితికి నిరసనగా గ్రామస్థులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై వరి నాట్లు వేశారు. వర్షాలతో రోడ్డు గుంతలు, బురదమయంగా మారి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.