హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీసీపీ రాజమహేంద్ర నాయక్‌కు ఐపీఎస్ హోదా

JN: జిల్లా కేంద్రంలో డీసీపీగా పనిచేస్తున్న రాజమహేంద్ర నాయక్కు ఐపీఎస్ హోదా లభించింది. తెలంగాణలో పనిచేస్తున్న ఏడుగురు నాన్-క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఉదయ్ ప్రకాష్ గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో రాజమహేంద్ర నాయక్ ఉన్నారు. ఆయనకు ఐపీఎస్ హోదా లభించడంపై అధికారులు, సిబ్బంది, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.