హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యం సేవించి నడిపిన 33 మంది పట్టివేత

వరంగల్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 33 మందిని పట్టుకున్నారు. వీరిలో నలుగురికి జైలు శిక్ష, 29 మందికి రూ. 25,400 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ కె. సుజాత సోమవారం తెలిపారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన మరో ఐదుగురికి రూ. 2,600 జరిమానా విధించారు.