హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ రికార్డు బ్రేక్ చేసిన జురెల్

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత యువ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత శతకంతో మెరిశాడు. నంబర్ 7 స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అజేయంగా 115 రన్స్ సాధించాడు. ఈ క్రమంలో శ్రీలంక గడ్డపై టెస్టుల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మాజీ కెప్టెన్ M.S. ధోనీ(76 రన్స్) ఆల్ టైమ్ రికార్డును జురెల్ బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.