హైదరాబాద్: 28°C
తెలంగాణ

27న ఉద్యోగుల జేఏసీ మహా ధర్నా

WGL: ఈ నెల 27న కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించనున్న మహా ధర్నాకు సంబంధించిన నోటీసును జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సోమవారం కలెక్టర్ సత్య శారదకు అందజేశారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ వేణుగోపాల్ తెలిపారు.కార్యక్రమంలో TNGOS గౌరవాధ్యక్షుడు రామ్‌కిషన్, తదితరులు పాల్గొన్నారు.