హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిలాద్ ఉన్ నబి జులూస్‌కు అనుమతి

KNR: ఈనెల 26న జరుపుకునే మిలాద్ ఉన్ నబి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. కమిటీ సభ్యులతో సమావేశమైన ఆయన భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. పండగ చివరి రోజు జులూస్‌కు నిబంధనల మేరకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.