NLG: నార్కెట్ పల్లి మండలంలోని గోపలాయపల్లి శివారులో జూద స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఆరుగురు జూదం ఆడుతుండగా.. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై విష్ణుమూర్తి పట్టుకున్నారు. వారి నుంచి రూ. 4,620 నగదు, ఆరు చరవాణులు, నాలుగు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
తెలంగాణ
జూద స్థావరాలపై పోలీసుల దాడులు


