భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రష్యా రాజధాని మాస్కోలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు, ద్వైపాక్షిక సహకారం అలాగే అంతర్జాతీయ అంశాలపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య బలమైన దౌత్య బంధానికి ప్రతీకగా నిలిచింది.
వార్తలు
రష్యా అధ్యక్షుడితో జైశంకర్ భేటీ


