HYD: నగరంలో తెల్లవారుజాము నుంచే మోస్తరు వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, తార్నాక, మానికేశ్వరి నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, లక్డీకాపుల్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్ష పడుతోంది. దీంతో వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లాల్సిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


