హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల ఉన్నత చదువుకు SBI సహకారం

AKP: ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత చదువుకు SBI సహకారం అందిస్తోంది. ఎస్‌బి‌ఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్-2026 ద్వారా చేయూతనిస్తోంది. ఇందుకోసం రూ.100 కోట్లు కేటాయించింది. ఈ సంవత్సరంలో 9 నుంచి 12 వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. దరఖాస్తుకు సెప్టెంబరు 4 వరకు గడువు ఉంది. పూర్తి సమాచారం కోసం www.sbiashascholarship.co.in సందర్శించాలని అధికారులు తెలిపారు.