హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికతో అసభ్య ప్రవర్తన.. మూడేళ్ల జైలు శిక్ష

WGL: 12 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కిరాణా షాపు యజమాని బాసని దయాకర్‌కు వరంగల్ జిల్లా పోక్సో కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది.2021 ఫిబ్రవరి 22న పర్వతగిరి మండలంలో ఇంటి సమీపంలోని కిరాణా దుకాణానికి సరుకుల కోసం వెళ్లిన బాలికతో దయాకర్ అసభ్యంగా ప్రవర్తించాడు. విచారణలో నేరం రుజువు కావడంతో సోమవారం కోర్టు శిక్ష విధించింది.