SRPT: రాఖీ పండగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం కోదాడ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు డిపో మేనేజర్ సోమవారం తెలిపారు. పండగ సందర్భంగా అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు, బంధువులను కలుసుకునేందుకు ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
తెలంగాణ
రాఖీ పండగకు ప్రత్యేక బస్సులు


