హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 2.30 కోట్ల చేప పిల్లల విడుదల

WNP: జిల్లాలోని సుమారు 900 చెరువులు, కుంటలు, జలాశయాల్లో 2.30 కోట్ల చేప పిల్లలను విడుదల చేసేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. సరఫరా టెండర్లు పూర్తయ్యాయి. చెరువుల్లో కనీసం 50 శాతం నీరు చేరిన తర్వాత చేప పిల్లలను విడుదల చేస్తామని మత్స్య శాఖ అధికారి లక్ష్మప్ప తెలిపారు. ఈ నెలాఖరు వరకు చేప పిల్లలను పరిశీలించి ఎంపిక చెయ్యనున్నట్లు తెలిపారు.