హైదరాబాద్: 28°C
తెలంగాణ

కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా వినీల్ రెడ్డి

NLG: BJP కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా నిడ‌మ‌నూరు మండలం రాజన్నగూడెంకు చెందిన సీనియర్ నాయకుడు ఎదుళ్ల వినీల్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని సోమవారం అందజేశారు. కిసాన్ మోర్చా బలోపేతానికి కృషి చేస్తానని వినీల్ రెడ్డి తెలిపారు.