హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భూ వివాదంలో తమ్ముడిపై అన్నదాడి!

KMM: కామేపల్లి మండలం, నెమలిపురిలో భూ వివాదం నేపథ్యంలో అన్న కుటుంబం తమ్ముడిపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. రవి, అతని అన్న ఇస్రా మధ్య కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో ఇస్రా కుటుంబ సభ్యులు రవి, అతని భార్యపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఘటనపై రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.