హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అధికారులు సర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలి'

SRPT: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై జిల్లాలో ప్రజలకు సర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నందాల్ పవార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఆగస్టు 27న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలన్నారు.