WGL: దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లిలో విద్యుదాఘాతంతో చల్ల రాజు (38) మృతి చెందాడు. సోమవారం ఇంటి ఆవరణలో విద్యుత్ మోటారు స్టార్టర్‌ను ఆన్ చేస్తుండగా ఇనుప రేకుకు విద్యుత్ ప్రసరించడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
తెలంగాణ
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి


