హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లెనిద్రలో ఎన్నికలపై పోలీసుల అవగాహన

W.G: మొగల్తూరు మండలం వారతిప్ప గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమంలో రూరల్ సీఐ నాగరాజు, ఎస్సై జయలక్ష్మి పాల్గొన్నారు. గ్రామస్తులతో సమావేశమై ఎన్నికల నియమావళి, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీఐ నాగరాజు సూచించారు.