KMM: కూసుమంచి మండలం బండమీదితండాకు చెందిన భూక్య మంగ్య ఇంట్లో ఈనెల 21న 3.5 తులాల బంగారం చోరీకి గురైంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సోమవారం ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
దొంగతనం కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్


