ASF: బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయమైన రిజర్వేషన్లు కల్పించడంతో పాటు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని BC సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూపునార్ రమేష్ కోరారు. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. జనగణనలో బీసీల సమగ్ర కులగణనను పారదర్శకంగా నిర్వహించి, కులాల వారీగా వాస్తవ జనాభా నమోదు చేయాలన్నారు.
తెలంగాణ
'బీసీల కులగణనను పారదర్శకంగా నిర్వహించాలి'


