హైదరాబాద్: 28°C
తెలంగాణ

CPS రద్దు కోసం సంగారెడ్డిలో ధర్నా

SRD: ఈ నెల 27న, సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నా ఏర్పాట్లను టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ జావీద్ అలీ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు మెరుగైన పీఆర్సీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటం తప్పదని పేర్కొన్నారు.