హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరగాళ్ల వలలో రైతు.. రూ.97 వేల హాంఫట్

SRD: కంగ్టి మండలంలో ఓ వ్యక్తి సైబర్ ముఠా చేతిలో మోసపోయాడు. PM కిసాన్ యోజన పేరుతో వాట్సాప్‌కు వచ్చిన లింక్ (APK ఫైల్) ఓపెన్ చేయడంతో ఫోన్ హ్యాక్ అయి, ఖాతా నుంచి రూ.97,469 మాయమైనట్లు సీఐ వెంకట్రెడ్డి తెలిపారు. అపరిచిత ఫైళ్లు, లింకులు ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.