హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

14వ వార్డులో ఎమ్మెల్యే డోర్ టు డోర్ కార్యక్రమం

PLD: నరసరావుపేట పట్టణంలోని 14వ వార్డులో సోమవారం రాత్రి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.