హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పిజిఆర్ఎస్: కలెక్టర్

ASR: అరకు మండలం గన్నెల స్వర్ణ గ్రామ సచివాలయంలో మంగళవారం (నేడు) జిల్లా స్థాయి పిజిఆర్ఎస్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంతి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే ఈ కార్యక్రమంలో స్థానికులు, పరిసర ప్రాంతాల ప్రజలు తమ సమస్యలు, అర్జీలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చన్నారు. జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.