KKD: ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో నిందితుడు సాధిక్‌ను అరెస్టు చేయడంలో చురుగ్గా వ్యవహరించిన ఇంద్రపాలెం ఎస్సై వీరబాబును ఎస్పీ బిందుమాధవ్ అభినందించారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం అనంతరం వీరబాబుకు ప్రశంసాపత్రం, రివార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కిషోర్ కుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇంద్రపాలెం ఎస్సైపై ఎస్పీ ప్రశంసలు


