హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

MDK: పాపన్నపేట(M) నర్సింగరావుపల్లి తండాకు చెందిన కేతావత్ తౌర్యా (32) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. డబ్బుల విషయంలో తల్లి, భార్యతో గొడవపడి మనస్తాపం చెందాడు. చెరువు కట్ట వద్ద అపస్మారక స్థితిలో ఉండగా కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.