హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ కలెక్టర్‌ను కలిసిన శ్రీనివాసరెడ్డి

ADB: ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌‌ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ రాజర్షి షాను పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని కలెక్టర్ రాజర్షి షాను కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం కృషి చేస్తానని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.