హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నాం: ఎస్పీ

SRCL: ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పేర్కొన్నారు. చందుర్తి పోలీస్ స్టేషన్‌ను సోమవారం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పెట్రోలింగ్ నిర్వహణ, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలను సమీక్షించారు.