హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్లాట్ల మోసం.. నిందితుడు అరెస్ట్

ADB: మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్లాట్లు ఇప్పిస్తామని నమ్మించి రూ. 7 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసులో గంగుల శేఖర్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు CI ప్రేమ్ కుమార్ సోమవారం తెలియజేశారు. పట్టణంలోని శంకర్‌గూడకు చెందిన సాయినాథ్‌ను మోసం చేసినట్లు వెల్లడించారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడని, ప్లాట్లు కొనేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.