హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు రాయదుర్గంలో లోకేశ్ పర్యటన

AP: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని గోవిందవాడలో మంత్రి లోకేశ్ ఇవాళ పర్యటించనున్నారు. 1,325 మెగావాట్లతో కొత్త పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే హులికెరలో సుజ్లాన్ ఎస్144 కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్లను ప్రారంభించనున్నారు. అనంతరం నల్లంపల్లి వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయి పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు.