హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.50 కోట్లతో రామచంద్రపురం అభివృద్ధి: మంత్రి

కోనసీమ: రామచంద్రపురాన్ని సువర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దుతామని మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన పట్టణాభివృద్ధి సమీక్షలో ఆయన పాల్గొన్నారు. రెండేళ్లలో రూ. 50 కోట్లతో అభివృద్ధి చేశామని, త్వరలో రూ. 14 కోట్ల HAM నిధులు వస్తాయన్నారు. వార్డుల వారీగా ప్రాధాన్యతతో పనులు, రూ. 4 కోట్లతో 3 గ్రీన్ పార్కుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు.