హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాపేశ్వరం మాజీ సర్పంచ్ రాజేశ్వరి మృతి

కోనసీమ: తాపేశ్వరం గ్రామ మాజీ సర్పంచ్ వాసంశెట్టి రాజేశ్వరి ఆకస్మికంగా మృతి చెందారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గ్రామాభివృద్ధికి ఆమె అందించిన సేవలను, పార్టీకి చేసిన కృషిని ఎమ్మెల్యే కొనియాడారు.