హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కృష్ణా: అవనిగడ్డ - కోడూరు మధ్య 33 కేవీ విద్యుత్ లైన్‌లో స్తంభాల ఏర్పాటు పనుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఉయ్యూరు ఈఈ బీవీ సుధాకర్ తెలిపారు. కోడూరు, రామకృష్ణాపురం ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు. ప్రజలు గమనించి సహకరించాలని కోడూరు ఏఈ గోపీచంద్ కోరారు.