హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటి సరఫరా పునరుద్ధరించాలని విజ్ఞప్తి

కృష్ణా: ఉయ్యూరు పట్టణంలో 7వ వార్డు కాలవగట్టు ప్రాంతంలో నీటి సరఫరా పునరుద్ధరించాలని ముస్లిం మహిళలు మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.  రాజేంద్ర ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ట్యాంకర్ దూరంగా ఉండటంతో వృద్ధులు, మహిళలు నీరు తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా నీరు అందించాలని మున్సిపల్ అధికారులను కోరారు.