హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మడకశిరలో రైతులకు 100 ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ

సత్యసాయి: మడకశిర నియోజకవర్గంలో 100 మంది రైతులకు 100 ట్రాన్స్‌ఫార్మర్లను అందజేశారు. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ ధ్యేయమని నాయకులు తెలిపారు. విద్యుత్ సమస్యలు తీర్చి ట్రాన్స్‌ఫార్మర్లు అందించినందుకు రైతులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.