హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన 25 కాంగ్రెస్ కుటుంబాలు

సత్యసాయి: నీలకంఠాపురంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 కుటుంబాలు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, గుండుమల తిప్పేస్వామి సమక్షంలో టీడీపీలో చేరాయి. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. చేరిన వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.