హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నిరుపయోగంగా సంపద తయారీ కేంద్రం

కృష్ణా: మోపిదేవి మండలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీల ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. మండలంలోని మేళ్లమర్తి లంక, కే.కొత్తపాలెం కేంద్రాలు లక్ష్య సాధనలో వెనుకబడ్డాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు కేంద్రాలను సద్వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.