హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు వాహనాల బహిరంగ వేలం

PDPL: సుల్తానాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు మంగళవారం ఉ. 10 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ గురునాథ్ రాథోడ్ తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆధ్వర్యంలో వేలం జరుగుతుందని పేర్కొన్నారు. పాల్గొనేవారు ఆధార్ జిరాక్స్‌తో పాటు, బిడ్ చేయనున్న వాహనం విలువలో 50% ఈఎండీ చెల్లించాలని ఎక్సైజ్ సీఐ తెలిపారు.