హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు.. ఉత్తర, ఈశాన్య తెలంగాణలో వర్షాలు పడతాయని చెప్పింది. ఆ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది